హనుమంతరావు అరెస్టు

16 May, 2020 11:47 IST|Sakshi
వీహెచ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

వలస కూలీలను తరలించే క్రమంలో గొడవ

టీఆర్‌ఎస్‌ శ్రేణులు,  పోలీసులతో వాగ్వాదం

సిరిసిల్లటౌన్‌: వలస కూలీలను తమ స్వస్థలాలకు తరలించే క్రమంలో పోలీసులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటకుండా డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో వీహెచ్‌ను అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపించడానికి కాంగ్రెస్‌ నాయకులు మూడు ప్రైవేటు బస్సులను మాట్లాడి, వాటికి అనుమతి తీసుకున్నట్లు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ తెలిపారు.

పట్టణ శివారులో సుమారు 60 మంది కార్మికులు ఉండటంతో పోలీసులు ఒక బస్సుకు డ్రైవర్‌ కాకుండా ఏడుగురినే తరలించేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఆగ్రహానికి గురైన వీహెచ్‌.. ‘కేటీఆ ర్‌.. ఇదేం దాదాగిరి.. ఇదేం ప్రజాస్వామ్యం.. కాంగ్రెసోళ్లు సాయం చేయద్దా.. చేస్తే.. తప్పా?’ అని ధ్వ జమెత్తారు. పోలీసులతో కలిసి అధికార పార్టీ నా యకులు వలస కార్మికులను స్వస్థలాలకు పంపించకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. కొద్దిసేప టి తర్వాత టీఆర్‌ఎస్‌ నాయకులు, పోలీసులతో వా గ్వాదానికి దిగారు. ఆయన పరుశపదజాలం వాడారంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతిఘటించారు. ఈక్రమంలోనే డీఎస్పీ చంద్రశేఖర్, టౌన్‌ సీఐ వెంకటనర్సయ్య ఆధ్వర్యంలో వీహెచ్‌ను అరెస్టు చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా