మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: అశోక్‌ గహ్లోత్‌

18 Jan, 2019 20:47 IST|Sakshi

33శాతం రిజర్వేషన్లకు రాజస్తాన్‌ మంత్రిమండలి తీర్మానం

జైపూర్‌: రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ శుక్రవారం వెల్లడించారు. మహిళల రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్‌ గాంధీ అదేశించారని తెలిపారు.

పార్లమెంట్‌లో కూడా మహిళల రిజర్వేషన్ల కోసం సోనియా గాంధీ తీవ్రంగా కృషి చేస్తున్నారని గహ్లోత్‌ పేర్కొన్నారు. తమ పోరాటం ఫలితంగా ఆ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉందన్నారు. కాగా రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు గహ్లోత్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు