ఆరోపణలపై స్పందించిన బీజేపీ నాయకుడు

10 Jul, 2019 18:26 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందంటూ జేడీఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వీటిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించడమూ తెల్సిందే. పది మంది రెబెల్‌ శాసన సభ్యులు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కంపెనీకి చెందిన విమానంలో ముంబైకి వెళ్లినట్లు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు రాజీవ్‌ చంద్రశేఖర్‌.

‘విమానంలో ప్రయాణించింనంత మాత్రాన ప్రభుత్వం కూలిపోతుందా.. అలానే జరిగితే ప్రభుత్వాన్ని కూలదోయడానికి అందరూ అలానే చేస్తారు కదా. ఎమ్మెల్యేలు విస్తారా విమానంలో ప్రయాణించారు. అంటే ఈ సంక్షోభానికి రతన్‌ టాటాను కూడా బాధ్యుడిని చేస్తారా’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ప్రయాణించింది చార్టెడ్‌ ప్లైట్‌లో.. ఇంతకు ముందు ఈ విమానాన్ని కాంగ్రెస్‌ నాయకులు కూడా ఉపయోగించారు. కాబట్టి జరగుతున్న పరిణామాలకు విమానాన్ని నిందించడం మాని కూటమిలోని అస్థిరత్వాన్ని విమర్శించుకుంటే మంచిందన్నారు రాజీవ్‌. ఈ సమస్యను బీజేపీ మీద నెట్టాలని సంకీర్ణ కూటమి నాయకులు ప్రయత్నించారు. కానీ వారి మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు రాజీవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు