హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

18 Sep, 2019 13:43 IST|Sakshi

చెన్నై: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్‌ ఎట్టకేలకు స్పందించారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్న షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్‌ షా వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించబోరని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. 

హిందీని జాతీయ భాషగా చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. స్టాలిన్‌, కమల్‌ హాసన్‌, మమతా బెనర్జీ వంటి పలువురు నేతలు కూడా షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా