కేసీఆర్‌ హయాంలో సర్వనాశనం

12 Nov, 2018 03:16 IST|Sakshi

ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌శుక్లా  

సాక్షి, హైదరాబాద్‌: ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం నెరవేరలేదని, కేసీఆర్‌ హయాంలో తెలంగాణ సర్వనాశనం అయిందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌శుక్లా వ్యాఖ్యానించారు. ఫాంహౌస్‌ నుంచి పాలన సాగించిన కేసీఆర్‌ నియం తలా వ్యవహరించారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ కిసాన్‌సెల్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, ఏఐసీసీ ప్రతినిధులు ప్రశాంత్, ఫయీమ్, సత్యప్రకాశ్, యతీశ్, సురేశ్‌కుమార్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ రాష్ట్ర గమనంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు.

లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్‌ తన కుటుంబంలో మాత్ర మే ఉపాధి చూపెట్టారని, తెలంగాణ యువతను నిర్వీర్యం చేశారన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన 1,200 మంది అమరవీరుల కుటుం బాలకు న్యాయం చేయడంలోనూ కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి, సోనియాగాంధీకి, అప్పటి ప్రధాని మన్మోహన్‌కు మాత్రమే దక్కుతుం దని, కాంగ్రెస్‌ ఇవ్వాలనుకోకపోతే కేసీఆర్‌ తెలంగాణ సాధించగలిగేవాడా అని ప్రశ్నించారు.

ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పు తప్పకుండా వస్తుం దని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై తీరుతుందన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి 80 సీట్లు తప్పకుండా వస్తాయన్నారు. టికెట్ల గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న గొడవల గురించి ప్రశ్నించగా, టికెట్ల గురించి గొడవలు జరగని పార్టీ ఏదీ ఉండదని, ఇది సర్వసాధారణమేనని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ, రాష్ట్రాన్ని పాలిస్తోన్న కేసీఆర్‌లది జబర్దస్త్‌ జోడీ అని, అబద్ధాలు చెప్పడంలో ఇద్దరిదీ ఒకటే నైజం అని విమర్శించారు. 

మరిన్ని వార్తలు