రైతు సమస్యలపై కాంగ్రెస్‌తో పనిచేస్తాం

20 Mar, 2018 01:25 IST|Sakshi

స్వాభిమాన్‌ షేత్కారీ సంఘటన చీఫ్‌ రాజు శెట్టి   

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ పార్టీతో కలసి పనిచేస్తానని స్వాభిమాన్‌ షేత్కారీ సంఘటన చీఫ్, లోక్‌సభ సభ్యుడు రాజు శెట్టి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సోమవారం నాడిక్కడ భేటీ అనంతరం శెట్టి మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై దృష్టి సారించనున్నట్లు రాహుల్‌ కాంగ్రెస్‌ ప్లీనరీలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 29న మహారాష్ట్రలో నిర్వహించనున్న రైతు సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాహుల్‌ను ఆయన ఆహ్వానించారు. గతేడాది ఆగస్టులో ఎన్డీఏ నుంచి శెట్టి బయటికొచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా