వారంలో మూడుగంటలే!

9 Mar, 2020 04:43 IST|Sakshi

ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభకు తీవ్ర అంతరాయం

న్యూఢిల్లీ: బడ్జెట్‌ మలి విడత సమావేశాలు మొదలైన మొదటి వారంలో రాజ్యసభ మూడు గంటలు మాత్రమే సవ్యంగా సాగింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతోనే సమయమంతా గడిచిపోయింది. షెడ్యూల్‌ ప్రకారం సభ 28.30 గంటలపాటు జరగాల్సి ఉండగా 26 గంటలపాటు అంతరాయం కలిగిందని, కేవలం 2.42 గంటలపాటు మాత్రమే కార్యకలాపాలు సాగాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సమావేశాలు 9.50 శాతమే ఫలప్రదమ య్యాయని పేర్కొన్నాయి.  దీంతోపాటు, ఫిబ్రవరి 12, మార్చి 1వ తేదీల మధ్య జరిగిన స్టాండింగ్‌ కమిటీల సమావేశాలకు సగం మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి.
 

మరిన్ని వార్తలు