చంద్రబాబుకు వర్మ సవాల్‌ 

24 May, 2019 20:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు నాయుడుకి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. ఇప్పటికే సెటైరికల్‌ ట్వీట్లతో చంద్రబాబును ఓ ఆటాడుకున్న వర్మ.. తాజాగా మరో ముందుడుగేశారు. ‘ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్టు చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర ఎల్లుండి(ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌ మీట్‌ పెట్ట బోతున్నాము. బస్తి మే సవాల్‌!!! ఎన్టీఆర్‌ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్‌’అంటూ వర్మ ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. 

ఇప్పటికే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చారిత్రాత్మక విక్టరిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ పాటను విడుదల చేశారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో ‘విజయం విజయం.. ఘన విజయం’ పాటకు వైఎస్సార్‌సీపీ సంబరాలు, జగన్‌ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు ‘ చంద్రబాబుపై జగన్‌ గ్రాండ్‌ విక్టరి. ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రివేంజ్‌’ అంటూ క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. 

ఏపీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ, చంద్రబాబుపై వరుస ట్వీట్లతో వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్‌ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ఈ వేసివకాలంలో ఏపీలో చాలా స్టోక్స్‌ వచ్చాయని, కానీ ఒకే ఒక స్టోక్‌కు టీడీపీ విలవిలలాడిందని పేర్కొన్నారు. ఇలా వైఎస్‌ జగన్‌ విజయం.. చంద్రబాబు ఓటమిని వర్మ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌