టీడీపీకి అసలు వారసుడెవరో చెప్పిన వర్మ

3 Apr, 2019 09:54 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ టీడీపీకి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు చేశానంటున్న వర్మ, మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా విడుదలను టీడీపీ వర్గాలు అడ్డుకోవటంతో వర్మ రగిలిపోతున్నాడు. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో గుబులు పుట్టించే ట్వీట్‌ చేశాడు వర్మ.

ఎన్టీఆర్‌, జూనియర్‌ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమా చూసిన తరువాతే చంద్రబాబుకు ఓటు వేయాలని కోరారు. నారా లోకేష్‌ టీడీపీకి నిజమైన వారసుడు కాదన్న వర్మ.. జూనియర్‌ ఎన్టీఆరే అసలైన వారసుడని పేర్కొన్నాడు. అంతేకాదు టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియరే అన్నాడు వర్మ.

ఇక సినిమా విషయానికి వస్తే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ చేయించేందుకు వర్మ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తాజాగా డిస్ట్రిబ్యూటర్‌లు కూడా సినిమా రిలీజ్‌పై స్టే విదించటంతో తమకు కలిగిన నష్టాన్ని హైకోర్టుకు నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.


Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

నేటి నుంచి అసెంబ్లీ 

వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా?: రేవంత్‌ 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి

టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్యకు ఊరట

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది ‘ఆ నలుగురే’

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘నేను పార్టీ మారడం లేదు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌