‘పవన్‌ నీకు దమ్ము, ధైర్యం లేదనుకుంటారు’

3 Jan, 2018 08:15 IST|Sakshi

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడాన్ని ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన అని అభివర్ణించిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. తాజాగా తమిళ ప్రజలంతా ఆయనకే ఓటేస్తారని, అతనిపై పోటీ చేయడం దండుగ అని పేర్కొన్నాడు. కొంతమంది తమిళ ప్రజలు తమ గౌరవాన్ని కోల్పోయారని, అది రజనీ తీసుకొస్తానని చెప్పడం గొప్ప విషయమని ప్రశంసించాడు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ విషయాలను రజినీకాంత్‌తో పోలుస్తూ మరో కామెంట్ చేశాడు. ఇప్పటికే కేసీఆర్‌-పవన్‌ భేటీపై అవసరం ఎంతటికైనా మారస్తుందన్న వర్మ ..'సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేసినట్లుగానే పవన్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో పోటీచేయాలి. అలా జరగకపోతే రజినీకాంత్‌లో ఉన్న దమ్ము, ధైర్యం పవన్‌లో లేవని ఆయన అభిమానులు భావిస్తారు. ఒకవేళ రజినీకాంత్‌లా కాకుండా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం అది మన తెలుగువారి ప్రతిష్టకే అవమానకరం' అని ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్‌ చేశాడు.

ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియా వేదికగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, మా నేత రెండు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని ఆయన అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. కాగా రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ‘ట్విట్టర్‌ అజ్ఞాతవాసిలోకి వెళ్లిన నేను పవన్‌ అజ్ఞాతవాసితో స్పూర్తిని పొంది తిరగి వచ్చా అని’ సెటైరిక్‌ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు