'పవన్‌ కల్యాణ్‌ ఒక పార్ట్‌టైం పొలిటీషియన్‌'

12 Feb, 2020 20:43 IST|Sakshi

సాక్షి,కర్నూల్‌ :  రాయలసీమ ప్రాంతం, కర్నూల్ అభివృద్ధిపై కనీస అవగాహన లేని నాయకుడు పవన్ కల్యాణ్ అంటూ కర్నూల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.వై. రామయ్య మండిపడ్డారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక ఘటన ఆధారంగా రాజకీయ లబ్ది పొందేందుకు పవన్ కళ్యాణ్ తాపాత్రయపడుతున్నారు. సుగాలి ప్రీతి అంశం ఇప్పటికే కోర్టుల్లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.  ప్రీతి ఘటనపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గతంలో ఈ అంశంపై మాట్లాడని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలి. ఇప్పటికే సీబీఐ కి అప్పగించిన ఈ కేసులో పవన్ కొత్తగా చేస్తున్న డిమాండ్ ఎవరికి అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడ కోసం ప్రీతిబాయ్ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నాడంటూ' ధ్వజమెత్తారు.
(మమ్మల్ని కాదు... పవన్‌ను అరెస్ట్‌ చేయండి)

పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ సమకాలీన అంశాలపై  అప్డేట్ అవ్వడం లేదని విమర్శించారు. స్పష్టమైన విధానాలతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే మంచిదని,  పార్ట్ టైం పొలిటీషియన్ గా మేకప్‌/ప్యాకప్ పాలిటిక్స్ చేస్తే ఉపయోగం లేదని రామయ్య పేర్కొన్నారు. దిశ, దశ లేని పవన్ రాయలసీమ యువతను తన వెంట నడవమనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కర్నూల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ మొదట మూడు రాజధానులకు తన మద్దత్తు తెలపాలని కోరారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు నాడు కావాలని చెప్పి నేడు మాత్రం వద్దనడంలో అంతర్యం ఏమిటో ఆయనే చెప్పాలన్నారు. అవగాహన రాహిత్యంతో రాజకీయాలు చేస్తున్న పవన్ కర్నూల్లో పర్యటించడం అర్థరహితమని, కర్నూల్ ప్రజల ఆకాంక్షలను  అవమాన పరుస్తున్నారని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ కేసు నేపథ్యంలో మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టం అమలు చేశారు. మహిళలకు జగనన్న ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు.  జగన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమ పథకాల అమలు సజావుగా సాగుతోందని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ఇలాంటి  ఆరోపణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బి.వై.రామయ్య తెలిపారు.
(అప్పుడే పవన్‌ సీమలో అడుగు పెట్టాలి..)

మరిన్ని వార్తలు