హబ్‌లు కాదు పబ్‌లు వచ్చాయి

20 Aug, 2018 07:29 IST|Sakshi
మాట్లాడుతున్న కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య

కర్నూలు సీక్యాంప్‌: జిల్లాలో పారిశ్రామిక హబ్, మైనింగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాటిచ్చారని, అయితే హబ్‌ కాకుండా ప్రతీ వీధికి పబ్‌లను మాత్రం వచ్చాయని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలు మండలం పసుపల గ్రామంలో పార్టీ మైనార్టీ నాయకుడు కొట్టముల్లా మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన  మామనే వెన్నుపోటు పొడిచారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేయడం ఆయనకు పెద్ద విషయం కాదన్నారు.

ఎన్నికల సమయంలో వందల సంఖ్యలో హామీలు ఇచ్చి ఎన్నికలు ముగిసిన వెంటనే వాటిని మర్చిపోవడం  చంద్రబాబుకే చెల్లిందన్నారు. మోసం చేయడంలో ఆయనకు ప్రత్యేక డిగ్రీలు ఉన్నాయని విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ, రజకులను, నాయి బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలోకి చేర్చుతానని హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆ వర్గాల వారిని బెదిరిస్తున్నారన్నారు. కులాల మధ్య కుంపటి పెట్టడం, రాజకీయంలో ధన ప్రవాహాన్ని పారించడం చంద్రబాబుకు పరిపాటుగా మారిందన్నారు. ఇలాంటి కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీతో నాలుగున్నర సంవత్సరాలు అంటకాగి ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తానని కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు.

 
జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుందాం.. 
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరువెంకటరెడ్డి మాట్లాడుతూ..మాట తప్పని, మడమ తిప్పని జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలు అమలై ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. టీడీపీ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.  పార్టీ నాయకులు రేమట మునిస్వామి, వెంకట్రాముడు, కర్నూలు మండలం ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పసుపల నాగరాజు, రవికుమార్, అయ్యన్న, ప్రభాకర్, చంద్ర, ప్రదీప్, వెంకటేశ్వర్లు, దొడ్డిపా డు మహబూబ్‌బాష,  మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్‌ పాల్గొన్నారు.

 
వైఎస్సార్‌సీపీలో చేరిక
పసుపల గ్రామానికి చెందిన 20మంది టీడీపీ నాయకులు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నాలుగున్నర సంవత్సరాలైనా టీడీపీ ప్రభుత్వం మాటలు చెబుతుంది తప్పా ప్రజా ప్రయోజనకరమైన పనులు చేయడం లేదని టీడీపీ నాయకుడు, పసుపల మాజీ ఉపసర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో ప్రతాప్‌రెడ్డి, అన్సర్‌బాషా, కమలాకర్, ప్రదీప్, మహేశ్, రాఘవేంద్ర, అనిల్‌కుమార్, రఘు, గరీబ్‌బాషా, మాబాషా, సుల్తాన్‌మియ్యా, మున్నాభాయ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు