‘వారిద్దరు కలియుగ కైకేయిలాంటి వారు’

4 Oct, 2018 10:10 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు కలియుగ కైకేయిలాంటి వారు. కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే వారికి శ్రీరాముడు గుర్తుకు వస్తాడు అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాన్‌దీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ‘ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ రెండు కూడా అయెధ్యలో రామ మం‍దిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాయని.. దీన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించలేరం’టూ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత సుర్జేవాలా స్పందిస్తూ.. ‘సత్య యుగంలో కైకేయి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రామున్ని రాజ్య బహిష్కరణ చేసింది. కానీ నేటి కలియుగ కైకేయి అయిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రం 30 ఏళ్ల పాటు రామున్ని బహిష్కరించారు. ఎన్నికలకు నాలుగ నెలల ముందు మాత్రమే వారికి శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. ఎన్నికలయిపోగానే రామున్ని వదిలేస్తారు. వీరంతా కేవలం వానాకాలంలో మాత్రమే అరిచే కప్పల వంటి వారు. కేవలం బెకబెకమంటారు తప్ప చేతల్లో ఏం ఉండదం’టూ విమర్శించారు.

అంతేకాక ప్రస్తుతం రామజన్మభూమి - బాబ్రీ మసీద్‌ వివాదం సుప్రీంకోర్ట్‌లో పెండింగ్‌లో ఉంది. కోర్టు ఏలాంటి తీర్పు వెలువరించిన దాన్ని అందరూ పాటించాలి అని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు