నవరత్నాలతో నవోదయం

21 Sep, 2018 06:30 IST|Sakshi
అల్లవరం మండలం గూడాలలో నవరత్నాలపై అవగాహన కల్పిస్తున్న అమలాపురం కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌

ఉత్సాహంగా ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’

ప్రజలతో మమేకమవుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

జననేత సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందంటూ భరోసా  

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ: ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం ప్రజలతో మమేకమై, పార్టీ విధానాల గురించి వివరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన్నే నిలుస్తుందని, తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎనిమిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని, జగన్‌ ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వస్తే తమ పార్టీ ఏం చేస్తుందో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. జగన్‌ ప్రకటించిన నవరత్న పథకాల గురించి వివరించారు. అన్ని వర్గాలకూ మేలు జరిగేలా నవరత్న పథకాలను రూపొందించారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గం వలసపాకల గ్రామంలో వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆధ్వర్యాన, అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గూడాలలో కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యాన, ముమ్మిడివరం నియోజకవర్గం  తాళ్ళరేవు మండలంలో కో ఆర్డినేటర్‌ పొన్నాడ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యాన ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ 47వ డివిజన్‌ క్వారీ ప్రాంతంలో కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం నర్సాపురపుపేటలో కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం కాండ్రకోటలో కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం శాటిలైట్‌ సిటీలో కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో కో ఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.

మరిన్ని వార్తలు