ఒక్క అబద్ధం చెప్పిఉంటే జగన్‌ సీఎం అయ్యేవారు

27 Sep, 2018 14:08 IST|Sakshi
బహిరంగసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి, పార్టీ నాయకులు

ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి

నెల్లూరు, ఆత్మకూరు : రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తామనే ఒకే ఒక్క అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయి ఉండేవారని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా సంఘీభావంగా చేజర్ల మండలం కోటితీర్థం నుంచి చేజర్ల వరకు బుధవారం ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అడుగడుగునా పార్టీ శ్రేణులు నీరాజనాలు పలుకగా, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం చేజర్ల బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రుణాలను మాఫీ చేయకుండా రైతులు, పొదుపు మహిళలను అప్పుల పాలు చేశారన్నారు.

దివంగత సీఎం వైఎస్సార్‌ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని మరెన్నో హామీలు అమలు చేశారని గుర్తుచేశారు. 47 లక్షల మంది పేదలకు సొంతింటి కలను సాకారం చేశారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రిలాగే మాట తప్పక– మడమ తిప్పక ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్‌మెంటుతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సొంత ఇంటి అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే మరే నాయకుడు చేయని విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాద యాత్ర సాగిస్తూ ఇప్పటికే 3000 కిమీ మైలు రాయి అ«ధిగమించటం ఓ రికార్డన్నారు. 2019 ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు సైనికుల్లా పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చేలా జగనన్నను ముఖ్య మంత్రిని చే సేందుకు సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో మరే నాయకుడు చేయని విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలనికోరారు.  రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలు డబ్బుతో గెలవవచ్చని ప్రజాధనాన్ని దోచుకుంటూ ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సూరా భాస్కర్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, అల్లారెడ్డి ఆనందరెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, గుండాల మధు, కన్వీనర్లు రఘునాథరెడ్డి, జీ శ్రీనివాసులునాయుడు, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీలు కుడారి హజరత్తమ్మ, పెయ్యల సంపూర్ణమ్మ, దేవసహాయం, ఎంపీపీలు కామాక్షమ్మ, కమతం శోభ, వైస్‌ఎంపీపీ తోట కృష్ణయ్య పూనూరు భారతీరెడ్డి, బాలకృష్ణారెడ్డి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు