వీళ్లకు మాత్రం చాలా కష్టం

4 Feb, 2018 14:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది సుమారు 59 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగియబోతోంది. వీరిలో 17 మంది ఎంపీలు ఉండగా, 12 మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మిగతా వారిలో నటి రేఖ, సచిన్‌ టెండూల్కర్‌ లాంటి సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వీరిలో 8 మంది కేంద్ర మంత్రులు కూడా ఉండటం విశేషం.  

కేంద్ర మంత్రులు జైట్లీ, జేడీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఆ లెక్కన్న వీరు తిరిగి నామినేట్‌ కావటం ఖరారైపోయినట్లే. ఇక టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ కూడా తిరిగి ఎన్నికయ్యే పరిస్థితులే కనిపిస్తుండగా.. దేవేందర్‌ గౌడ్‌ విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. కానీ, ఎమ్మెల్యేల సంఖ్యా బలం తక్కువగా కారణంగా కాంగ్రెస్‌ పార్టీ తిరిగి తన ఎంపీలను నామినేట్‌ చేసుకోవటం కష్టమైన పననే చెప్పొచ్చు. (రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అని కూడా పేర్కొంటారు)

కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు చిరంజీవి, రేణుకా చౌదరి, ఆనంద్‌ భాస్కర్‌లు  రీ నామినేట్‌ కావటం కష్టమనే చెప్పాలి. ఒకవేళ చిరుకి గనుక అవకాశం లభించకపోతే క్రియాశీలక రాజకీయాలకు దూరమై పూర్తిగా సినిమాలకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ హయాంలోనే నామినేట్‌ అయిన సచిన్‌, రేఖల పరిస్థితి కూడా అంతే. వీరిద్దరు సభకు హాజరు అయ్యే విషయంలో ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ లెక్కన్న కాంగ్రెస్‌ ఎంపీల్లో మెజార్టీ సభ్యులు తిరిగి నామినేట్‌ కావటం అనుమానమే!

మరిన్ని వార్తలు