పంచాయతీ ఎన్నికలకు రెడీ

29 Mar, 2018 02:26 IST|Sakshi

     ఏర్పాట్లను ముమ్మరం చేసిన ఎన్నికల సంఘం 

     ఓటర్ల జాబితాలు పంపించాలని కలెక్టర్లకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఓటర్ల జాబితాల సవరణ మార్చి 24న ముగియడంతో పంచాయతీల వారీగా జాబితాలు పంపాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన సమా చారం అందించాలని ప్రభుత్వానికి, అన్ని జిల్లా ల్లోని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు లేఖ రాసింది. 2018 జనవరి 1 వరకు అందుబాటు లో ఉన్న జాబితాలు ప్రాతిపదికగా తీసుకోవా లని నిర్ణయించిన ఈసీ, జిల్లాల్లోని ఓటర్ల జాబితాల డేటాబేస్‌ను డిజిటల్‌ ఫార్మాట్‌లో పం పాలని కోరింది. నోటిఫికేషన్‌ రాక ముందే జాబితాలు అందితే.. గ్రామాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించడానికి వీలవుతుందని పేర్కొంది. వీలైనంత త్వరగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురిస్తామని తెలిపింది. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం నేడు అసెంబ్లీ ఆమోదం పొందనుంది. పాత పంచాయతీలతో పాటు కొత్త వాటికీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.  

ఫొటోలు లేవని.. 
రాష్ట్రంలోని మొత్తం 35 నియోజకవర్గాల తుది ఓటరు జాబితాలు జనవరిలోనే సిద్ధమవగా, మిగతా నియోజకవర్గాల జాబితాల సవరణ కూడా ముగిసింది. మార్చి 24తో అన్ని ప్రాం తాల్లో తుది ఓటరు జాబితాలు ప్రచురించారు. కొత్త జాబితాల్లో ఫొటోలు లేవని, జనవరి 1 వరకు ఉన్న జాబితాలను వెంటనే పంపాలని ఈసీ ఆదేశించింది. కొత్తగా ఓట్ల నమోదు, ఓట ర్ల జాబితాలో సవరణలను ఎప్పటికప్పుడు చేపడుతుంటారని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది.    

మరిన్ని వార్తలు