మా వెనుకున్నది ఆయనే: రెబల్‌ ఎమ్మెల్యే

26 Jul, 2019 13:00 IST|Sakshi

రెబల్‌ ఎమ్మెల్యే శివరాం సంచలన వ్యాఖ్యలు

 సిద్దరామయ్య చెప్పినట్టే నడుచుకున్నాం

బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ రెబల్స్‌ వెనుక ఆయన హస్తం ఉందంటూ జేడీఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వారి  ఆ వార్తలను నిజం చేస్తూ.. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే శివరాం హెర్బర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా సిద్దరామయ్య సూచనల మేరకే నడుచుకున్నామంటూ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  ‘కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి సిద్దరామయ్యే కారణం. పార్టీకి దూరంగా ఉండమని కొద్ది రోజుల క్రితం ఆయన మాకు చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్నే నిందిస్తున్నారు. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. మేం బీజేపీలో చేరుతున్నామనేది అబద్ధం’ అని తెలిపారు.

శివరాం వ్యాఖ్యలపై కన్నడ రాజకీయాల్లో పెను దుమారం చేలరేగుతోంది. ఈ నేపథ్యంలో హెర్బర్‌ వ్యాఖ్యలపై సిద్దరామయ్య స్పందించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారని. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్తానని ట్వీట్‌ చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కాపాడటానికి తనవంతు కృషి చేశానని సిద్దూ చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక సంక్షోభం అనంతరం స్థానిక నేతలపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పతనం వెనుక సిద్దరామయ్య ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్‌ అధిష్టానం దృషికి కూడా వెళ్లాయి. దీంతో ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ప్రభుత్వ పతనం వెనుక కాంగ్రెస్‌!

ఇదిలావుండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ఉండేందుకు మరోసారి రెబల్స్‌ను బుజ్జగింజే ప్రయత్నంలో పడ్డారు జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు. మరోవైపు వారి రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కర్ణాటక రాజకీయాల ఉత్కంఠ మరికొన్ని రోజులు సాగనున్నట్లు తెలుస్తోంది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు

ఈ బిల్లు సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం

యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్‌ ఫిక్స్‌

స్థానికులకు ఉద్యోగాలు.. టీడీపీ వ్యతిరేకమా?

‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’

గూగుల్‌కు ఊహించని షాక్‌

ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులు

రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాం: కన్నబాబు

‘కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’

పార్లమెంట్‌లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు

త్వరలో ఐటీ పాలసీ.. స్టార్టప్‌ కంపెనీలూ వస్తాయ్‌

టీఆర్‌ఎస్‌ అరాచకాలపై పోరాడతాం : బండి సంజయ్‌

‘దాణా కుంభకోణం కంటే పెద్ద స్కాం’

‘ఆ ఎంపీ తల నరికి పార్లమెంటుకు వేలాడదీయండి’

కావాలనే ఆ నగరాన్ని టీడీపీ అభివృద్ధి చేయలేదు

ట్రాలీలో ఓడను తెచ్చి ఊరేగించారు : జోగి రమేశ్‌

సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!

రైతులకు పసుపు పత్రాలు ఎందుకు ఇచ్చారు?

నేతా.. కక్కిస్తా మేత!

ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు

ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

‘ట్రిపుల్‌ తలాక్‌’కు లోక్‌సభ ఓకే

‘టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు