నిరుద్యోగులను వంచించిన ప్రభుత్వం

11 Feb, 2019 08:25 IST|Sakshi
రెడ్డి శాంతి

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

శ్రీకాకుళం , ఎల్‌.ఎన్‌.పేట: గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో ఆశలు కల్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక  ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిలువునా ముంచేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని, నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ఇస్తామని, విద్యాసంస్థల్లో ఫీజులు భారం లేకుండా చేస్తామని.. ఇలా ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కాక విస్మరించారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఫీజుల భారం భరించలేక అనేక మంది పేదింటి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి మభ్యపెట్టేందుకు నిరుద్యోగ భృతి పెంపు పేరిట డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో 6వేల ఉపాధ్యాయ పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పి, వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు