వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. రిపబ్లిక్‌ టీవీ సర్వే

4 Oct, 2018 23:23 IST|Sakshi

టీడీపీకి ఘోర పరాభావం 

రిపబ్లిక్‌ టీవీ–సీ ఓటర్‌ తాజా సర్వే అంచనాల ప్రకారం... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ 21 ఎంపీ సీట్లు గెలుచుకుని విజయఢంకా మోగించబోతోంది. అధికార టీడీపీ కేవలం నాలుగు సీట్లతో ఘోరపరాజయం మూటగట్టుకోబోతోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.. 
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లిక్‌ టీవీ–సీ ఓటర్‌ ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిపిన సర్వే ఫలితాలను గురువారం రాత్రి  వెల్లడించింది. ఏపీలో 25 లోక్‌సభస్థానాలకు జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీపై  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నట్టు పేర్కొంది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు, మిత్రపక్షం బీజేపీకి రెండు  సీట్లు  వచ్చాయి.  ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండుపార్టీలు విడివిడిగానే పోటీ చేయనున్నాయి. కేవలం 4 ఎంపీ స్థానాలకే పరిమితం కావడం ద్వారా  టీడీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లనున్నట్టు ఈ సర్వే అంచనా వేస్తోంది.  టీడీపీ ఓట్ల శాతం దాదాపు పదిశాతం వరకు భారీగా తగ్గిపోయి 31.4 శాతానికి (గతంలోని 40.8 శాతం) పరిమితం కానున్నట్టు వెల్లడైంది.
రిపబ్లిక్‌ టీవీ–సీ ఓటర్‌ ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ అంచనాల ప్రకారం...
గెలుచుకునే సీట్ల అంచనాలు– మొత్తం ఎంపీ సీట్లు=25
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ=21
టీడీపీ = 4
పార్టీలు సాధించే ఓట్ల శాతంపై అంచనాలు...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ = 41.9 శాతం
టీడీపీ = 31.4 శాతం
 

మరిన్ని వార్తలు