‘టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకుంటున్నారు’

25 Mar, 2018 13:14 IST|Sakshi
జి. కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశం లేవనెత్తితే చర్చకు రానివ్వకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకుంటున్నారని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు.  అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణాలో ఉన్న 5 లక్షల మంది ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు 43 శాతం అని ప్రకటించారు, కానీ ఫిట్‌మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పెన్షన్‌ విషయంలో పాత పద్ధతిలోనే కావాలని ఉద్యోగులు అడుగుతున్నారని, వారి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశమైనప్పట్టికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 

ఆర్డర్ సర్వ్ పేరిట ఇక్కడి ఉద్యోగులను రాష్ట్రం నుంచి పంపారని, వారిని కూడా ఇక్కడికి రప్పించాలని కోరారు. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌లను, ఆరోగ్యశ్రీలో కలపకూడదని కోరారు. లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయలేదని, జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టిస్తానన్న హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. జిల్లాల్లో, హైదరాబాద్‌లో కూడా హామీ ఇచ్చారని అందుకే వారికి సొంత ఇల్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షాన్ని బయటకు పంపి వారే మాట్లాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు చర్చించే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్య లేవనెత్తితే దానికీ కూడా అడ్డుపడుతూ మాట్లాడనివ్వడం లేదన్నారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ కూడా ఇవ్వటం లేదని వ్యాఖ్యానించారు. సీపీఎస్ విధానం కాకుండా పాత పెన్షన్ విధానం కావాలని ఉద్యోగులు కోరుతున్నా పట్టించుకోకుండా సభను పక్కదోవపట్టిస్తున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు