మోదీతో కేసీఆర్‌ లాలూచీ బట్టబయలు

17 Mar, 2018 03:04 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ లాలూచీ పార్లమెంటు సమావేశాల్లో బట్టబయలైందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోడానికి బీజేపీ తరపున టీఆర్‌ఎస్‌ ఎంపీలు శిఖండి పాత్ర పోషించారని శుక్రవారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.

వైఎస్సార్‌ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తూ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా అనేక పార్టీల సభ్యులు తమ స్థానాల వద్ద లేచి నిలబడ్డారని, అప్పుడే టీఆర్‌ఎస్‌ సభ్యులు బీజేపీకి అనుకూలంగా గందరగోళం చేశారన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి మద్దతిస్తామంటూనే హోదాను వ్యతిరేకిస్తున్న మోదీని కాపాడేలా టీఆర్‌ఎస్‌ ఎంపీలు వ్యవహరిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు