కేసీఆర్‌ బొమ్మ.. దుర్మార్గం: రేవంత్‌ 

7 Sep, 2019 03:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోట్లాది మంది కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలోని రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌ బొమ్మ, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు చెక్కడం దుర్మార్గమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

సీఎం కేసీఆర్‌ కోట్లాది మంది హిందువుల మనోభావాలను, భక్తుల నమ్మకాలను, విశ్వాసాలను దెబ్బ తీశారన్నారు. ఇదీ ప్రభుత్వ ఆదేశాలతో జరిగిందా? లేక అత్యుత్సాహంతో జరిగిందా అనేది తేలాలన్నారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేయాలని, చెక్కిన ఆ చిత్రాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా