ఉత్తమ్‌ పోటీచేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేస్తా: సర్వే

18 Mar, 2019 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, కీలకనేతలంతా పార్టీని వీడుతుంటే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్‌ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, నాయకత్వం మార్పు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రక్షాళన జరిగిననాడే తిరిగి గాంధీ భవన్‌లో ఆడుగుపెడతానని స్పష్టంచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్‌ పార్టీని మాత్రం వీడేదిలేదని, ఉత్తమ్‌ ఎంపీగా పోటీచేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సర్వే తెలిపారు.
రేవంత్‌కు సీపీఐ మద్దతు

కాగా మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 22న ఆయన ఎంపీగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్వే సత్యనారాయణతో భేటీ అయ్యి మద్దతు కోరారు. మాల్కాజ్‌గిరి అంటే సర్వే సొంత ఇల్లు లాంటిదని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా రేవంత్‌ కోరారు. కాగా ఎంపీగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ప్రకటించాల్సిందిగా నిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డితో కూడా రేవంత్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్‌లో ‘సర్వే’ దుమారం

మరిన్ని వార్తలు