ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఎమ్మెల్యే.. పేమెంట్‌ కోటాలో మంత్రి..

5 Apr, 2019 07:15 IST|Sakshi
మల్లాపూర్‌ నెహ్రూనగర్‌ రోడ్‌షోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్‌లో సమస్యలు పట్టని మల్లారెడ్డి

అల్లుడు ఏమి పట్టించుకుంటాడని ప్రశ్న

మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి  

మల్లాపూర్‌ నెహ్రూనగర్‌లో రోడ్‌షో

మల్లాపూర్‌:  ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఎమ్మెల్యే పదవి.. పేమెంట్‌ కోటాలో మంత్రి పదవిని.. వేలం పాటలో అల్లుడికి ఎంపీ టిక్కెట్‌ను మల్లారెడ్డి కుటుంబం దక్కించుకుందని మల్కాజిగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రోడ్‌షోలో భాగంగా గురువారం ఆయన మల్లాపూర్‌ నెహ్రూనగర్‌ చౌరస్తా వద్ద మాట్లాడుతూ..  ఐదేళ్లలో మల్లారెడ్డి ఎప్పుడూ మల్కాజిగిరి పార్లమెంట్‌లోని ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, ఆయన అల్లుడు పట్టించుకుంటాడా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతాడన్నారు. ప్రతి పేదవాడికి నెలకు రూ.6 వేలను నేరుగా తమ ఖాతాలోకి వేస్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నెహ్రూనగర్, అశోక్‌నగర్‌ కాలనీల్లో హైటెన్షన్‌ వైర్లను తొలగింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, వీఎస్‌.బోస్, సోమశేఖర్‌రెడ్డి, మొసలి శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, రాజేష్, సూర్ణం రాజేష్, చిన్న దుర్గయ్య, కేబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు