ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు

26 May, 2019 05:08 IST|Sakshi
రమేశ్‌కుమార్‌ శర్మ

డిపాజిట్‌ కోల్పోయిన  సంపన్నుడు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్‌కుమార్‌ శర్మ డిపాజిట్‌ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్‌కుమార్, బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్‌ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్‌క్రిపాల్‌ యాదవ్‌ గెలుపొందారు. రామ్‌క్రిపాల్‌కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్‌సభలో పోటీపడిన టాప్‌ 5 ధనవంతుల్లో రమేశ్‌కుమార్‌ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే.

వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్‌ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్‌ లోని చిన్‌ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్‌ నాథ్‌ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్‌ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్‌ సింగ్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు