నితీష్‌ కుమార్‌కు ఆర్జేడీ నేత సవాల్‌

2 Jun, 2018 21:44 IST|Sakshi

పాట్నా: యువనాయకుడు తేజస్వీ యాదవ్‌తో చర్చకు రావాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు ఆర్జేడీ ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. తమ నాయకుడు చదువుకోలేదని విమర్శించడం కాదు.. చర్చల్లో పాల్గొని  మా నాయకుడిపై మాటల్లో గెలవాలని చాలెంజ్‌ చేశారు. ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో జోకిహాట్ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నితీశ్‌ కుమార్‌ను విమర్శిస్తూ తేజస్వీ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.

ఆయన ట్వీట్‌కు బదులిస్తూ జేడియూ నేత... ‘తేజస్వీ పెద్దగా చదువుకోలేదు. అందుకే సరైన భాషను ఉపయోగించలేదు. ఆయన పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేదు. కావున ఆయన నుంచి ఇంత కంటే మంచి భాషను అశించవద్దని ఎద్దేవా చేశారు’. దీనిపై స్పందించిన ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్‌ వీరేంద్ర జేడీయూ ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు.

‘మా నాయకుడుతో ఇంగ్లీష్‌, హిందీలో మాట్లాడానికి మీరు, మీ నాయకుడు నితీశ్‌ కుమార్‌ సిద్దమా. చర్చల్లో మా నాయకుడు ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాలను నుంచి తప్పుకుంటా’ అని చాలెంజ్‌ చేశారు. చదువు ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. ప్రముఖ కవులు కాళీదాసు, తులసీదాసు కూడా పెద్దగా చదువుకోలేదని గుర్తు చేశారు. తన చాలెంజ్‌ను స్వీకరించి చర్చ వేదికను ఏర్పాటు చేయాలని జేడీయూ నేతలను కోరారు.

మరిన్ని వార్తలు