‘ఏ-1 ముద్దాయి చంద్రబాబే’

5 Nov, 2018 13:14 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి వెకిలిగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడును ఇకపై శునకానంద పార్టీ అధ్యక్షుడు అని పిలవాలంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగి పది రోజులు గడుస్తున్నా ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిందితులను పట్టుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కేసులో ఏ1 ముద్దాయి చంద్రబాబేనని అందుకే విచారణను నీరు గారుస్తున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ను అడ్డుకునే దమ్ము ధైర్యంలేకనే బాబు ఇలా కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైఎస్‌ జగన్‌నేనని సర్వేలన్నీ వెల్లడిస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు ఇలా దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని రోజా విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని లేని సంస్థలతో దర్యాప్తు జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.

దున్నపోతుకు పాలు పితుకుతున్నారా?
ఆర్టిస్టు శివాజీ చెప్పిన ‘గరుడ పురాణం’ నిజమేనన్న చంద్రబాబు.. ఏకంగా సీఎంపై దాడి జరుగుతుందని చెప్పినా ఆ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని రోజా ప్రశ్నించారు. మీరన్నట్లు ‘ఆపరేషన్‌ గరుడ’  నిజమే అయితే.. నిజానిజాలు తెలుసుకోకుండా రాష్ట్ర ఇంటలెజిన్స్‌ విభాగం, పోలీసులు దున్నపోతులకు పాలు పితుకుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే కాపాడుకోలేని చంద్రబాబు ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడాతారంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు విలువలు లేవని, అందుకే తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు దొంగలాగా సందుల్లో ధర్మపోరాటం పేరిట కొత్తనాటకం మొదలుపెట్టారని విమర్శించారు.

ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి
‘చంద్రబాబు పిచ్చి మాటలు, పిచ్చి పొత్తులు చూసి ఆయనను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి. తన పాలనపై నమ్మకం సడలిన ప్రతిసారీ ఆయన పొత్తులకు సిద్ధపడతారు. అందుకే రాహుల్‌ గాంధీని అడ్డుపెట్టుకుని ఓట్లు అడగాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనతో పొత్తు పెట్టుకున్నవారంతా రిటైర్‌ అయిపోవాల్సిందే. కాబట్టి పాపం.. రాహుల్‌ గాంధీ చిన్న వయసులోనే రాజకీయాల నుంచి రిటైర్‌ కావాల్సి వస్తుంది. ఇవన్నీ సరే.. కాంగ్రెస్‌తో జత కలిస్తే ఉరి వేసుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి,  అయ్యన్నపాత్రుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు’ అంటూ రోజా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు