-

నిరూపిస్తే రాజకీయ సన్యాసం!

31 Aug, 2018 00:53 IST|Sakshi

ఒక్కో నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు: ఎంపీ కవిత

కాదని రుజువు చేయగలరా అని సవాల్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో నిజామాబాద్‌ జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గానికైనా రూ.2 వేల కోట్లకు తక్కువ నిధులు వచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఒకవేళ నిరూపించకపోతే మీరూ సిద్ధమేనా అని విపక్షాలకు సవాల్‌ విసిరారు. గురువారం నిజామాబాద్‌లో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ , బీజేపీ, చిన్నాచితకా పార్టీల నేతలు విమర్శలు చేసే ముందు ఆచితూచి మాట్లాడాలని అన్నారు.

అవసరమైతే న్యాయపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చ రించారు. ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తనకు తెలియదని అలాంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. జోనల్‌ వ్యవస్థ , హైకోర్టు విభజన పట్ల కేం ద్రం సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తున్నా మని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సభ నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు భయం పట్టుకుందని, సభకు పార్టీ శ్రే ణులను తరలించేందుకు వినియోగించనున్న ఆర్టీసీ బస్సులకు డబ్బులు చెల్లిస్తున్నామని ఉద్దెరకు తీసుకువెళ్లడం లేదని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్‌గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌ ఆమేర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు