కేసీఆర్‌ బెదిరింపులకు భయపడం

10 Jun, 2018 16:04 IST|Sakshi
గేటు ధర్నా చేస్తున్న నాయకులు

డిపో ఎదుట కార్మికుల ధర్నా

నష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలే

ధర్నాకు మద్దతు తెలిపిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు

ఆసిఫాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉ ద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరింపులకు పా ల్పడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలన కు నిదర్శమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్సు డి పోలో నిర్వహించిన గేటు ధర్నాకు ఆయన మద్ద తు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా క్రియాశీలకమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆ ర్‌    46 రోజులపాటు కార్మికులతో సమ్మె చేయిం చి.. ఇప్పుడు సమ్మె చేస్తే సంస్థను మూసి వేస్తామనడంలో ఆంత్యరం ఏమిటని ప్రశ్నించారు.

ప్రభు త్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టాలబాట పడుతుందని ఆరోపించారు. సంస్థలో పని చేసేది 52 వేల కార్మికుల కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజ ల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికుల తమ ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు సమ్మె నిర్వహించి తీరాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దింపేంది కార్మికులేనన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ ఇచ్చింది కేవలం రూ.508 కోట్లు మాత్రమేనని, సంస్థను వ్యాపార రంగంగా కాకుండా ప్రజల సంక్షేమ రంగంగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్, జేఏసీ నాయకులు ఐలయ్య, సత్యనారాయణ, ఎజాజ్, వసంత్, హన్మంతు, సుధాకర్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా