ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

26 Jul, 2019 04:10 IST|Sakshi
మాట్లాడుతున్న జైరాం రమేశ్‌

రశీదులపై ఎంపీలతో సంతకాలు చేయించిన సీఎం రమేశ్‌

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్‌

సమాచార కమిషన్‌పై మోదీ పగ తీర్చుకుంటున్నారు: జైరాం రమేశ్‌  

న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణల బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ‘సమాచార హక్కు (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభ సోమవారమే ఆమోదించగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఆ బిల్లు పార్లమెంటులో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును క్షుణ్నంగా పరిశీలించేందుకు ఎంపిక కమిటీకి పంపాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు బిల్లును ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్‌ నిర్వహించగా, ఆ ఓటింగ్‌ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఎంపీలను మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భయపెట్టేందుకు ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్, ఓటు రశీదులను తీసుకెళ్లి సభ్యుల చేత వాటిపై సంతకాలు చేయిస్తుండటం కనిపించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. విపక్ష సభ్యులు సీఎం రమేశ్‌తో గొడవకు దిగి, ఆయన చేతుల్లో నుంచి ఆ రశీదులను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను ఎలా గెలిచిందో మనకు సభలోనే సాక్ష్యం కనిపిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. సీఎం రమేశ్‌ చర్యను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులంతా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంలో గతంలో ఉన్న లోటుపాట్లను తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆజాద్‌ మాట్లాడుతూ ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు.

మీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మేం బయటకు వెళ్లిపోతున్నాం’ అని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ మాట్లాడుతూ సమాచార కమిషనర్లు గతంలో ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పలు తీర్పులు ఇచ్చినందున, ఇప్పుడు మోదీ సమాచార కమిషన్‌పై పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును, సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. అనంతరం ఓట్లు లెక్కపెట్టగా, బిల్లును ఎంపిక కమిటీకి పంపవద్దని 117 ఓట్లు, పంపాలని 75 ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో విపక్ష సభ్యులెవరూ సభలో లేకపోవడంతో సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలం, వేతనాలను కేంద్రమే నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ట్రిపుల్‌ తలాక్‌’కు లోక్‌సభ ఓకే

‘టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు’

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌

స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్‌ తలాక్‌?!

ఇదొక విప్లవాత్మక కార్యాచరణ: సీఎం జగన్‌

‘కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది’

చంద్రబాబు కంటే కేసీఆర్‌ వెయ్యిరెట్లు మంచివారు..

జైలు శిక్ష అభ్యంతరకరం: ఎంపీ మిథున్‌రెడ్డి

తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి

సేన గూటికి ఎన్సీపీ ముంబై చీఫ్‌

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

రేషన్‌ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదు

అందుకే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు

గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ

లోకేశ్‌ సీఎం కాకూడదని..

ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన ఆనం

ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన

‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం

‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం

కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

‘వైఎస్సార్‌ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’

ఆ జిల్లా నుంచి గెలిస్తే సీఎం పదవి ఖాయం.. కానీ

బీజేపీకీ సంకీర్ణ పరిస్థితే..

రైతన్న మేలు కోరే ప్రభుత్వమిది

ట్రంప్‌తో భేటీలో కశ్మీర్‌ ప్రస్తావనే లేదు

రోజూ ఇదే రాద్ధాంతం

హై‘కమాండ్‌’ కోసం ఎదురుచూపులు

మాజీ ప్రధానుల కోసం మ్యూజియం

‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం