సీఎం రేసు: సచిన్‌ పైలట్‌ ఆసక్తికర సమాధానం

26 Nov, 2018 15:02 IST|Sakshi

జైపూర్‌‌: రాజస్థాన్‌ ఎన్ని‍కల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సీఎం రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారని ప్రశ్నించగా.. ఫైలట్‌ తనదైనా స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. ‘నాకు 26 సంవత్సరాలున్నప్పుడు కాంగ్రెస్‌ ఎంపీగా అవకాశం ఇచ్చింది. 31 ఏళ్లు ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రి పదవిని, 35 ఏళ్లకు రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని చేసింది. 

కాంగ్రెస్‌ నాకు చాలా చేసింది. ఇప్పుడు నావంతు కాంగ్రెస్‌కు తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. పార్టీని సంస్థాగతంగా అభివృద్ది చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని అన్నారు.  ‘కాంగ్రెస్‌ పార్టీలో ఒక ఆనవాయితి ఉంది. ముందు ఎన్నికలు జరుగుతాయి. తరువాత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇప్పుడు సీఎం ఎవరనేది ముఖ్యం కాదు. బీజేపీ అవినీతి పాలన నుంచి రాష్ట్రప్రజలను బయటపడవేయడమే ముఖ్యం’  అని స్పష్టంచేశారు. 2013 ఎన్నికల్లో 200స్థానాలలో బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోనుందని విశ్లేషకులు చేబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే.

మరిన్ని వార్తలు