చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

13 Feb, 2020 23:00 IST|Sakshi

లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది నిజం కాదా : సజ్జల

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో రూ.2వేల కోట్లు కోట్లు బయటపడ్డ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘పర్సనల్‌ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?’ అంటూ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలను అధికారులు బహిర్గతం చేశారు. (2 వేల కోట్ల నల్లధనం: టీడీపీ నేతల్లో గుబులు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా