‘చివరకు ఆ విమానం ఏమయ్యిందో తెలియదు’

14 Jun, 2020 16:28 IST|Sakshi

చంద్రబాబుపై సజ్జల వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతికేసులో అచ్చెన్నాయుడు అరెస్టు విషయం తెలియగానే హైదరాబాద్‌నుంచి పరుగులు తీసి గుంటూరు వచ్చారుకాని, అదే ఆదుర్తా వైజాగ్‌ గ్యాస్‌ బాధితుల విషయంలో చూపలేదని విమర్శించారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎలాంటిదో ఇక్కడ స్ఫష్టంగా అర్థమవుతోందంటూ ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 

‘మొన్నటికి మొన్న తాను వైజాగ్‌ వెళ్తానంటే కావాలనే విమానాలు రద్దుచేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపైన, జగన్‌గారిపైన అభాండాలు వేశారు. ఆరోజు రోడ్డు మార్గంలో ఉండవల్లిలో కరకట్ట ఇంటికి వచ్చారు కాని, వైజాగ్‌ వెళ్లలేదు’ అని సజ్జల విమర్శించారు. (చదవండి‘ఆంధ్రజ్యోతి కిట్టు మారడు’)

‘వైజాగ్‌ గ్యాస్‌ బాధితుల పరామర్శ విషయంలో చంద్రబాబు నాటకాలన్నీ బయటపడ్డాయి. గ్యాస్‌ దుర్ఘటన రోజున కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంటున్నా, ప్రత్యేక విమానంలో పరామర్శకు వెళ్తున్నా... అంటూ హడావిడిచేశారు. చివరకు ఆ విమానం ఏమయ్యిందో తెలియదు’అని సజ్జల ఎద్దేవా చేశారు.
(చదవండి : అచ్చెన్నకు మా ఉసురే తగిలింది)

మరిన్ని వార్తలు