ఇది చిన్నతీగ మాత్రమే..: సజ్జల

14 Feb, 2020 14:24 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలపై పడిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారంలో అధిక సొమ్ము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్లిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వారం రోజుల పాటు జరిగిన ఐటీ దాడుల్లో ఆయన మాజీ పీఎస్ వద్దే రూ. 2000 కోట్లు దొరికాయని.. ఈ పరిణామాలు చూస్తుంటే బాబు దోపిడీ రూ. లక్ష కోట్లకు చేరిందనడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదన్నారు. ఇది చిన్న తీగ మాత్రమేనని... పూర్తి విచారణ జరిగితే చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల బాగోతం బయటపడుతుందని పేర్కొన్నారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్కు చంద్రబాబు పయనం!)

కాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో... మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించినట్లుగా ఐటీ శాఖ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి... తాజా పరిణామాలతో అంతర్జాతీయ నేరస్తులతో బాబుకు సంబంధాలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోందన్నారు. ఐటీ దాడుల గురించి ఆయన, అనుచర వర్గం కిక్కురుమనడంలేదని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ విషయంపై ఎందుకు నోరు మెదపడంలేని ప్రశ్నించారు. 

సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు
వికేంద్రీకరణపై అవగాహన కల్పించేందుకు నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ చేపట్టిన ప్రచార రథాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణ రాష్ట్రానికి ఎంతో అవసరమని.. అన్ని ప్రాంతాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అయితే వికేంద్రీకరణపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రత్నాకర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తాము భావిస్తుంటే.. చంద్రబాబు మాత్రం వికేంద్రీకరణను అడ్డుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు అవినీతి బట్టబయలు
ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు
బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు

లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది
చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

(చంద్రబాబు మాజీ పీఎస్ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా