మాజీ జవానుకు షాకిచ్చిన ఈసీ

1 May, 2019 16:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసి బరిలో నిలిచిన బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌కు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీచేస్తున్న యాదవ్‌ నామినేషన్‌ను  అక్కడి అధికారులు తిరస్కరించారు. సరైన పత్రాలు సమర్పించ లేదంటూ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈసీ ఆదేశించినట్టే సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అన్యాయంగా తన నామినేషన్‌ను తిరస్కరించారని యాదవ్‌ ఆరోపించారు. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించ నున్నట్టు తెలిపారు.

కాగా షాలినీ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌ను బరిలో నిలిపింది ఎస్‌పీ. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కోలేదంటూ ఈసీ మంగళవారం  యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.  మే 1వ తేదీలోగా (బుధవారంలోగా) సమాధానం ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు