‘ఆ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు’

31 Oct, 2019 17:31 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనతో కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. మరోవైపు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే వదంతులను నమ్మరాదని చెప్పారు. శివసేనకు ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి ఆఫర్‌ రాలేదని చెప్పుకొచ్చారు.  మీడియా ద్వారా కొన్ని పార్టీలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో అధికారం పంచుకునేందుకు కుదిరిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా హామీని అమలు చేయాలని బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఆయన కోరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన సమావేశంలో ఈ ఫార్ములాను అమిత్‌ షా అంగీకరించారని ఠాక్రే చెబుతున్నారు. కాగా శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండేను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

>
మరిన్ని వార్తలు