బీజేపీలో చేరిన గాయని సప‍్నా చౌదరి

7 Jul, 2019 12:22 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: హరియాణా పాపులర్‌ సింగర్‌, డాన్సర్‌ సప్నా చౌదరి ఎట్టకేలకు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ స్టేడియంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమె పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌... సప్నా చౌదరికి కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జనరల్‌ సెక్రటరీ రాంలాల్‌, ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. సింగర్‌, డ్యాన్సర్‌గానే కాకుండా  బిగ్‌ బాస్‌ 11 సీజన్‌లో పాల్గొన్న సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఊహాగానాలు వచ్చినా...అనూహ్యంగా బీజేపీకి చేరువ అయ్యారు.

చదవండికాంగ్రెస్‌కు షాక్‌.. సప్నా చౌదరీ యూటర్న్‌..!

‘డ్యాన్స్‌ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్‌’


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు