9 తర్వాత అభ్యర్థుల ప్రకటన

6 Nov, 2018 02:56 IST|Sakshi
సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న కుంతియా

సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదు: ఆర్‌సీ కుంతియా

రెండు, మూడు రోజుల్లో సర్దుబాటు పూర్తి

కూటమికి బేషరతుగా ముస్లిం నేషనల్‌ లీగ్‌ మద్దతు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా కూటమి అభ్యర్థుల ప్రకట న 9వ తేదీ తర్వాతే ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సి.కుంతియా స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదని, ఇంకా సీపీఐ, తెలంగాణ జనసమితిలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. రెండు మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆలిండియా ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ కార్యదర్శి అబ్దుల్‌ ఘనీ, ఏఐసీసీ కార్యదర్శులు సలీం ఆహ్మద్, శ్రీనివాసన్‌లతో కలసి మాట్లాడారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా అధికారికంగా ప్రకటించలేదన్నా రు. కూటమిగానే ఎన్నికల్లో కలసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఊహాగానాలను నమ్మొద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి ప్రజా కూటమికి మద్దతు లభిస్తోందని చెప్పారు. మజ్లిస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తో.. టీఆర్‌ఎస్‌ బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపిం చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ బీజేపీతో కలసి వెళ్లడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్‌ ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.

కూటమికి ముస్లిం లీగ్‌ మద్దతు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమికి ఆలిండియా ముస్లిం నేషనల్‌ లీగ్‌ పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. బీజేపీకి అన్ని అంశాల్లో మద్దతు ఇస్తు న్న టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కూటమికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ కార్యదర్శి అబ్దుల్‌ ఘనీ తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్, మజ్లిస్‌ పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపిం చారు. ప్రధాని మోదీ లవ్‌ జిహాద్, గోరక్షక్‌ల పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

ముస్లిం లపై జరుగుతున్న దాడులపై మోదీని కేసీఆర్‌ ఎందు కు ప్రశ్నించలేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి ముస్లిం లను దగా చేశాడని దుయ్యబట్టారు. ముస్లింలకు ఇచ్చిన ఒక హమీ కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద ఎత్తున కేటాయించి 30 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు