ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్‌

30 Jul, 2019 14:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ అయితేనే న్యాయం చేయగలరని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులో కాంగ్రెస్ పార్టీని గట్టేక్కించే సామర్థ్యం ప్రియాంక గాంధీకి మాత్రమే ఉందని సీనియర్‌ నేత శశిథరూర్ ప్రియాంక నాయకత్వానికి తాజాగా మద్దతు తెలిపారు. ఇటీవల హర్యానా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా, శత్రుఘ్నసిన్హా వంటి సీనియర్‌ నాయకులు యువతరాన్ని ప్రోత్సహించాలని, ప్రియాంకలో ఇందిరాగాంధీ తరహా నాయకత్వ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడుతూ ప్రియాంకగాంధీకి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే లక్షణాలు మెండుగా ఉన్నాయన్నారు. పార్టీలో ఉన్న అనిశ్చితి తొలగి, పార్టీ బలపడాలంటే ప్రియాంక నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆమె వంద శాతం అర్హురాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం తర్వాత  సీనియర్ నేతలు ఎవరూ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రియాంక ఒక సమర్థవంతమైన నాయకురాలిగా మనకు కనిపిస్తున్నారని శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. సీనియర్ల మాటలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రియాంక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విదేశాంగ మంత్రిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

మాస్‌ లీడర్‌ ముఖేష్‌గౌడ్‌

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

రమేశ్‌ భేష్‌; సిద్దు మెచ్చుకోలు

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య, భర్త మధ్యలో ఆమె!

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు