‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’

4 Sep, 2019 17:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. పార్టీలో ఆయారాం, గయరాం వంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నియమించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాచేస్తే అనేకమంది పార్టీని వీడిపోతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్‌లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్‌ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అపరిశుభ్ర వాతావరణంతో రోగాలు ప్రబలుతున్నాయని, భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల పరిస్థితిని చూడాలని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు