కరోనా ఎఫెక్ట్‌: మోదీపై రెబల్‌ నేత ‍ప్రశంసలు

3 Feb, 2020 18:53 IST|Sakshi

పట్నా : బీజేపీ నేతలపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పూడు విమర్శల దాడి చేసే కాంగ్రెస్‌ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఓ ఆశ్చర్యకరమైన ట్వీట్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించే ఈ రెబల్‌ నేత.. అనూహ్యంగా మోదీపై ప్రశంసలు కురిపించారు. చైనా వ్యాప్తంగా భయంకరమైన ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వుహాన్‌లో ఉన్న భారతీయులను సొంత ప్రాంతాలకు తరలించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. ప్రత్యేక విమానం బోయింగ్‌ 747 ద్వారా అక్కడున్న భారతీయులు కరోనా బారిన పడకుండా వేగవంతమైన చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై శత్రుఘ్న సిన్హా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీకి సెల్యూట్‌ అంటూ కితాబిచ్చారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. (ఢిల్లీ చేరుకున్న భార‌తీయులు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు