రాజ్‌నాథ్‌కు పోటీగా ఉమ్మడి అభ్యర్థి ?

4 Apr, 2019 21:02 IST|Sakshi

సాక్షి, లక్నో: బీజేపీకి  అసంతృప్తి నేత, పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నుసిన్హా  సెగ మరోసారి తాకింది.  లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు   పోటిగా ఉమ్మడి అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా బరిలో నిలవనున్నారని విశ్వసనీయ వర్గాల  సమాచారం.  లక్నోనుంచి  బీజేపీ సీనియర్‌ రాజ్‌నాథ్  పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి  కీలకమైన లక్నో స్థానం నుంచి పూనం సిన్హా బీఎస్పీ సహకారంతో సమాజ్ వాదీ పార్టీ తరపున లక్నో స్థానం నుంచి పోటీలో దిగనున్నారు.  రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ భాగస్వామ్య పద్దతిలో కూటమి బీజేపీకి సవాల్‌ విసురుతోంది. మరోవైపు లక్నో స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా..ఎస్పీ అభ్యర్థి పూనం సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.  అలాగే నాలుగు లక్షల కాయస్తా (శతృఘ్న సిన్హా సామాజికవర్గం) ఓటర్లతోపాటు, 1.3లక్షల సింధీ ( పూనం సిన్హా సామాజికవర్గం) ఓటర్లు ఉన్న నేపథ్యంలో  ఆమె అభ్యర్థి త్వానికి మంచి జోష్‌ నిస్తుందని ఎస్‌పీ నేత ఒకరు వ్యాఖ‍్యానించారు.  దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. 

కాగా బీజేపీ ఎంపీ  శత్రుఘ్న సిన్హా పార్టీకి గుడ్‌ బై చెప్పి షాకిచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో  గత నెలలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచుకున్నారు.  మరి తాజా పరిణామంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్‌ తప్పదు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు