స్వరం మార్చిన శివసేన!

28 Oct, 2019 14:19 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో​ కింగ్‌ మేకర్‌గా అవతరించిన శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో దేశ ఆర్థిక మందగమనానికి బీజేపీయే కారణమంటూ సంచలన కథనం ప్రచురించింది. కేంద్రం తీసుకున్న ఆర్థిక విధానాలపై సామ్నా సోమవారం నాటి ఎడిటోరియల్‌ సంచికలో విమర్శలు గుప్పించింది. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీతో శివసేన విభేదిస్తున్న సంగతి తెలిసిందే.

దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి బీజేపీ విధానాలే కారణమని, దీనికి వారే బాధ్యత వహించాలంటూ పేర్కొంది. ప్రతి దీపావళి పండుగ నాడు కళకళలాడే దేశీయ మార్కెట్‌లు నేడు వెలవెలబోవడానికి కారణాలేంటో బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. ఆదివారం రోజున శివసేన నాయకులు రిమోట్‌ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత రోజే శివసేన అధికారిక పత్రికలో ఇలాంటి కథనం రాయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన నేత దివాకర్‌ రౌత్‌ సోమవారం వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రెండు పార్టీలు చెప్పడం గమనార్హం. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేనకు పూర్తి ఆధిక్యం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి పదవి, ప్రభుత్వ ఏర్పాటులో చెరిసగం వాటా ఉండాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబట్టింది. అయితే, బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. మరోవైపు శివసేన ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. ఈ విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. తాజాగా శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై ఘాటు విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’

‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’

‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’

ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు!

బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

థాక్రే చేతిలోనే రిమోట్‌ కంట్రోల్‌.. సీఎం పదవిని పంచాల్సిందే!

సీఎంగా ఖట్టర్‌.. డిప్యూటీ సీఎం దుష్యంత్‌..

పండగ వేళ విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం 

18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు

ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

రాసిస్తేనే మద్దతిస్తాం..

సీఎం ఖట్టర్‌.. డిప్యూటీ దుష్యంత్‌

జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు

‘డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం’

ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’

‘చావుతో రాజకీయాలు చేసేది ఆయన మాత్రమే’

‘బాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌’

హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ వరాల జల్లు

హరియాణా: బీజేపీకి గవర్నర్‌ ఆహ్వానం

‘సీఎం గొప్ప మనసుతో ఒకరోజు ముందే దీపావళి’

‘ప్రజారాజ్యం నుంచి అందుకే పవన్‌ బయటికి’

ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్‌ ప్రసాద్‌

ఎందుకు మనసు మార్చుకున్నారు?

డిప్యూటీ సీఎంగా తెరపైకి దుష్యంత్‌ తల్లి పేరు!

హ‌రియాణా సీఎంగా రేపు ఖ‌ట్ట‌ర్‌ ప్ర‌మాణం

అదేమీ అద్భుతం కాదు: సురవరం

అభ్యర్ధి క్రిమినల్‌ అయినా సరే! మద్దతివ్వాలి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'గుడ్‌లక్‌ సఖి' అంటున్న కీర్తి సురేశ్‌

హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ రిపోర్ట్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి అభిమానుల సరికొత్త పంథా..!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!