బీజేపీకి మద్దతిచ్చిన శివసేన..

25 Jul, 2019 16:26 IST|Sakshi

న్యూఢిల్లీ : కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన బీజేపీకి మద్దతు పలికింది. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ మరాఠా పార్టీ.. గత కొంతకాలంగా బీజేపీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన  బీజేపీకి శివసేన శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. అదేవిధంగా బలం లేని జేడీఎస్‌కు(37) కాంగ్రెస్‌(78) మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందని శివసేన అభిప్రాయపడింది. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన సొంత పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది.

కాగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో సైతం కాంగ్రెస్‌ను గద్దె దింపి బీజేపీ అధికారంలోకి రావడానికి ఉవిళ్లూరుతుందంటూ వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో మెజారిటీ లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడం అంటే ప్రజాస్వామ్యానికి చేటు చేయడమేనంటూ శివసేన మరోసారి తనదైన శైలిలో బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించింది. ఇక కర్ణాటక బలపరీక్షలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఇంకా మెజారిటీ రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో కుమారస్వామి తన రాజీనామాను గవర్నర్‌ వాజుబాయ్‌వాలాకు సమర్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు