ఈసీకి శివసేన లేఖ

27 May, 2018 11:45 IST|Sakshi

సాక్షి, ముంబై: పాల్ఘడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓటర్లకి డబ్బులు పంచుతుందని శివసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార బలంతో బీజేపీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. బీజేపీ ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తోంది. బీజేపీ అభ్యర్థి రాజేందర్‌ రావిట్‌ను అనర్హుడిగా ప్రకటించాలి’ అని శివసేన ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది.

బీజేపీ డబ్బులు పంచడం తమ కార్యకర్తలు చూశారని, ఎన్నికల సంఘం అధికారుల తనిఖీలో కూడా బీజేపీ నేతలు పట్టబడ్డారని శివసేన ఎమ్మెల్యే అమిత్ ఘోడా ఆరోపించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శివసేన, బీజేపీ ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కుటమి నుంచి బయటకు వచ్చిన శివసేన పాల్ఘడ్‌ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వురుగా అభ్యర్థులను నిలిపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు