చంద్రబాబుకు అంత ఆత్రం ఎందుకు?

31 May, 2020 12:58 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వేగవంతమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని తీసుకోని.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కొనసాగించాలని చంద్రబాబుకు అంత ఆత్రం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించారని.. కానీ కొందరు చట్టాల్లోని లోసుగులను అడ్డం పెట్టుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, ప్రజల ప్రాణాలు, పర్యావరణ హక్కులకు భారీగా నష్టం జరిగిన కోర్టులు జోక్యం చేసుకోవచ్చని అప్పలరాజు అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న కొందరు న్యాయమూర్తులను గతంలో సుప్రీం కోర్టు మందలించిందని గుర్తుచేశారు. శాసన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ చొరబాటుపై చర్చ జరుగుతుందన్నారు. వైజాగ్‌ వెళ్తానని అనుమతి తీసుకున్న చంద్రబాబు నాయుడు.. మహానాడు అయిపోగానే తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు