కాంగ్రెస్‌కు షాక్‌.. సప్నా చౌదరీ యూటర్న్‌..!

25 Mar, 2019 10:55 IST|Sakshi
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీతో సప్న

చంఢీగడ్‌ : హరియాణా పాపులర్‌ సింగర్‌, డాన్సర్‌ సప్నా చౌదరీ యూటర్న్‌ తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు ఆదివారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మధుర నియోజకవర్గంలో బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌, సిట్టింగ్‌ ఎంపీ హేమమాలినిపై సప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్‌ వ్యూహమని ప్రచారం జరిగింది. అయితే, తాను కాంగ్రెస్‌లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరఫునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంక గాంధీతో ఉన్న ఫోటో కూడా పాతదని ఆమె ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ ఆమె పార్టీలో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్‌ అయ్యింది. ‘ఆమె స్వయంగా శనివారం నాడు పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్‌లో చేరారు’ అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. 
(‘డ్యాన్స్‌ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్‌’)

ఇదిలాఉండగా... ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీతో సప్న భేటీ అయ్యారనే వార్తలు కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆమె యూటర్న్‌ తీసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ప్రియాంక గాంధీని కలిసిన కొద్ది గంటలకే ఆమె తివారీతో సమావేశమయ్యారు. అక్కడా.. ఇక్కడా.. ఆమె అవే దుస్తుల్లో దర్శనమివ్వడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ‘సప్న సంతకాన్ని కాంగ్రెస్‌ ఫోర్జరీ చేసింది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆమెకు సంబంధించిన వీడియా అసత్యం. ఆ ఫారం 2011-15 మధ్య కాలానిది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు