కేసీఆర్‌ ఫ్రంట్‌.. మూసి నది!

19 Apr, 2018 17:27 IST|Sakshi

ఫ్రంట్‌ల్లో చేరే ఆలోచన లేదు

రాజకీయ తీర్మానంపై చర్చ జరిపాం

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నగరంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతారాం ఏచూరి గురువారం విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల కిందటే రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించామని, కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని ఏచూరి తెలిపారు. రాజకీయ తీర్మానంపై అందరి అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. పార్టీ సభ్యుడు ఎవరైనా తమ ప్రతిపాదన ఇవ్వవచ్చునని, ప్రతిపాదనలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. గతంలో పార్టీ పరంగా జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. జస్టిస్‌ లోయ మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని చెప్పారు. ఈ కేసును ఉన్నత ధర్మాసనం సమీక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పార్టీలో సీక్రేట్ బ్యాలెట్‌కు ఆస్కారం లేదని, ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఒప్పందం ఉండబోదని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అంశంపై కూడా మహాసభల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలు, ప్రత్యేక హోదా విషయంలో పార్టీ సమావేశాల్లో కచ్చితంగా తీర్మానం ఉంటుందని తెలిపారు. జాతీయ ప్రత్యామ్యాయ
 ఫ్రంట్‌లలో చేరే ఆలోచన లేదని పేర్కొంటూ.. కేసీఆర్ ఫ్రంట్‌ను ఏచూరి మూసీ నదితో పోల్చారు.

మరిన్ని వార్తలు