‘క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా’

13 Jul, 2018 08:19 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : ‘పార్టీలో ఉంటూ ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా’ అని అధిష్టానానికి చెప్పినట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఇష్టం లేనివారు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని.. ఇక నుంచి ఎవరైనా జోక్యం చేసుకున్నా.. తప్పులు చేసినా ఊరుకోనన్నారు. 

అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొగులుతానని తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఇబ్బంది కల్గించిందని, ఇది రాజకీయాల్లో కూడా సంచలనం కలిగిందని సోమారపు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో పార్టీలో క్రమశిక్షణ లేదని అధిష్టానానికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రులతో పాటు పక్కనున్న ఎమ్మెల్యేలు సైతం జోక్యం చేసుకుంటారని, ఇది తగదని చెప్పినట్లు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు